Posts

Showing posts with the label Padana mounamugane పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన

Padana mounamugane పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన 150

Padana mounamugane పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన 150. Paadanaa! mounamugaane పల్లవి : పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి - నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సహజీవనము - నా ఆశలు తీర్చీ తృప్తి పరచెనే 1. ప్రతి ఉదయమున - నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగెనే - నా ప్రాణాత్మశరీరమును నా విమోచనా గానము నీవే - నా రక్షణ శృంగము నీవే ||పాడనా|| 2. దీర్ఘ శాంతమూ - నీ కాడిని మోయుచూ నేర్చుకొందునే నీ ప్రశాంత పవనాలు అణచెనే - నా వ్యామోహపు పొంగులన్నియూ నా ఓదార్పు నిధివీ నీవే - నా ఆనంద క్షేత్రము నీవే ||పాడనా|| 3. నీ ఆలయమై - నీ మహిమను నేను కప్పుకొంటినే నీ తైలాభిషేకము నిండెనే - నా అంతరంగమంతయునూ నా మానస వీణవు నీవే - నా ఆరాధన పల్లకి నీవే ||పాడనా|| Pallavi : Paadanaa! mounamugaane sthuthi keerthana choodanaa! oorakane nilichi - nee paraakramu kaaryamulu yesayyaa! neetho sahajeevanamu - naa aashalu thircchi thrupthiparachene 1.Prathi oodhayamuna nee krupalo nenu oollasinthune nee rakthaabhishekamu kadigene - praanaathma shariramunu naa vimochana gaanamu neeve - naa rakshana shrungam...