Naa hrudhayana నా హృదయాన కొలువైన 116
Naa hrudhayana నా హృదయాన కొలువైన 116. Naa hrudhayaana పల్లవి : నా హృదయాన కొలువైన - యేసయ్యా నా అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే నీ సన్నిధిలో పూజార్హుడా 1.అగ్ని ఏడంతలై - మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడే నే నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే నా స్తోత్రబలులన్నీ నీకేనయ్యా ||నా హృదయాన|| 2.అంతా వ్యర్థమని - వ్యర్థులైరెదరో నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెను నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును ||నా హృదయాన|| 3.విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవ్వరైననూ - వృదిచేసింది నీవే కదా సంఘక్షేమాభివృదికే - పరిచర్య ధర్మము నియమించినావే నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే నా స్వరము నీకే అర్పింతును ||నా హృదయాన|| Pallavi : Naa hrudhayaana koluvaina yesayyaa naa anuvanuvu ninne prasthuthinchene keerthaneeyudaa naa hrudhayaarpanalo pranamilledhane nee sanni...