Naa jeevitha bhagaswamivi నా జీవిత భాగస్వామివి నీవు
Naa jeevitha bhagaswamivi నా జీవిత భాగస్వామివి నీవు 103. Naa jeevitha bhaagaswaamivi పల్లవి : నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నాకే సమృద్దిగా నీ కృపను పంచావు నా యేసురాజ కృపాసాగరా అనంతస్తోత్రార్హుడా 1.నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి నీ సైన్యములో నన్ను చేర్చితివి || నా జీవిత || 2.నీ దయగల మాటలే చేరదీసినవి నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి నీ విందుశాలకు నను చేర్చితివి || నా జీవిత || 3.నీ దయగల తలంపులే రూపునిచ్చినవి నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు నీ అంతఃపురములో నను చేర్చుదువు || నా జీవిత || Pallavi : Naa jeevitha bhaagaswaamivi neevu naa praanamutho penavesukunnaavu neevu naake samruddhigaa nee krupanu panchaavu naa yesu raaja krupaasaagaraa anantha sthothraarhudaa 1.Nee dhayagala kanusaigale dhairyaparachinavi nee adugujaadale naaku throvanu choopinavi nee raajya paurunigaa nannu maarchithivi nee...