Padana mounamugane పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన 150

Padana mounamugane పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన

150. Paadanaa! mounamugaane

పల్లవి : పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన
చూడనా ఊరకనే నిలిచి - నీ పరాక్రమ కార్యములు
యేసయ్యా నీతో సహజీవనము - నా ఆశలు తీర్చీ తృప్తి పరచెనే

1. ప్రతి ఉదయమున - నీ కృపలో నేను ఉల్లసింతునే
నీ రక్తాభిషేకము కడిగెనే - నా ప్రాణాత్మశరీరమును
నా విమోచనా గానము నీవే - నా రక్షణ శృంగము నీవే
||పాడనా||

2. దీర్ఘ శాంతమూ - నీ కాడిని మోయుచూ నేర్చుకొందునే
నీ ప్రశాంత పవనాలు అణచెనే - నా వ్యామోహపు పొంగులన్నియూ
నా ఓదార్పు నిధివీ నీవే - నా ఆనంద క్షేత్రము నీవే
||పాడనా||

3. నీ ఆలయమై - నీ మహిమను నేను కప్పుకొంటినే
నీ తైలాభిషేకము నిండెనే - నా అంతరంగమంతయునూ
నా మానస వీణవు నీవే - నా ఆరాధన పల్లకి నీవే
||పాడనా||

Pallavi : Paadanaa! mounamugaane sthuthi keerthana
choodanaa! oorakane nilichi - nee paraakramu kaaryamulu
yesayyaa! neetho sahajeevanamu - naa aashalu thircchi thrupthiparachene

1.Prathi oodhayamuna nee krupalo nenu oollasinthune
nee rakthaabhishekamu kadigene - praanaathma shariramunu
naa vimochana gaanamu neeve - naa rakshana shrungamu neeve
!!Paadanaa!!

2.Dheergashaanthamu nee kaadini moyuchu nerchukondhune
nee prashaantha pavanaalu anachene - naa vyaamohapu pongulanniyu
naa odhaarpu nidhivi neeve - naa aanandha kshethramu neeve
!!Paadanaa!!

3.Nee aalayamai nee mahimanu nenu kappukontine
nee thailaabhishekamu nindene - naa antharangamanthayunu
naa maanasaveenavu neeve - aaraadhana pallaki neeve
!!Paadanaa!!