Manaserigina yesayyaa మనసెరిగిన యేసయ్యా 123
Manaserigina yesayyaa మనసెరిగిన యేసయ్యా 123. Manaserigina yesayyaa పల్లవి : మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు 1.నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుధ్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా సాహసక్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు || మనసెరిగిన || 2.వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి ఆత్మీయ యాత్రలొ నేను సొమ్మసిల్లి పోనుగా ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు || మనసెరిగిన || 3.మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు || మనసెరిగిన || Pallavi : Manaserigina yesayyaa madhilona jathagaa nilichaavu hrudhayaana nee aagnyalu vraasi nee pathrikanugaa maarchaavu 1.Nirjiva kriyalanu vidachi paripoorna parishuddhathakai saagipodhunu nenu aagipolenugaa saahasakriyalu cheyu nee hasthamutho nannu pattukontive viduvalevu ennadu !!Manaserigina!! 2.Venukunna vaatini marachi nee thodu nenu kori...