Neeve krupadharamu నీవే కృపాధారము త్రియేక దేవా 204
Neeve krupadharamu నీవే కృపాధారము త్రియేక దేవా 204. Neeve krupaadhaaramu పల్లవి : నీవే కృపాధారముత్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా ||2|| నూతన బలమును నవ నూతన కృపను ||2|| నేటివరకు దయచేయుచున్నావు – నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా 1. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను ||2|| ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి ||2|| ఆపదలెన్నో అలముకున్నను – అభయము నిచ్చితివి ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి ఆలొచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతం అంకితమయ్యా ||2|| ||నీవే|| 2. సర్వకృపానిధి – సీయోను పురవాసి – నీ స్వాస్థ్యముకై నను పిలచితివి ||2|| సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను – సహనము కలిగి ||2|| శిధిలముకాని సంపదలెన్నో నాకై దాచితివి సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకేనయా ||నీవే|| 3. ప్రాకారములను దాటించితివి – ప్రార్ధన వినెడి పావనమూర్తివి ||2|| పరిశుద్ధులతో నను నిలిపితివి – నీ కార్యములను నూతన పరచి ||2|| పావనమై...