Krupagala devaa dhayagala raajaa 212 కృపగల దేవా దయగల రాజా Lyrics
New year song 2021 Hosanna Krupagala devaa dhayagala raajaa కృపగల దేవా దయగల రాజా Lyrics New year song 2021 Hosanna Ministries పల్లవి : కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుఘనతేజ నీ చరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని సర్వాధికారి నీవే దేవా నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా 1. త్రోవను చూపే తారవు నీవే గమ్యము చేర్చే సారధి నీవే జీవనయాత్ర శుభప్రదమాయే నా ప్రతి ప్రార్ధన పరిమళమాయే నీ ఉదయకాంతిలో నను నడుపుము నా హృదిని నీ శాంతితో నింపుము 2. కృప చూపి నన్ను అభిషేకించి వాగ్ధానములు నెరవేర్చినావే బహు వింతగా నను ప్రేమించినావే బలమైన జనముగా నను మార్చినావే నీ కీర్తి జగమంత వివరింతును నీ దివ్య మహిమలను ప్రకటింతును 3. నా యేసురాజా వరుడైన దేవా మేఘాల మీద దిగివచ్చు వేళ ఆకాశవీధిలో కమనీయ కాంతిలో ప్రియమైన సంఘమై నిను చేరెదను నిలిచెదను నీతోనే సీయోనులో జీవింతు నీలోనే యుగయుగములు Pallavi : Krupagala devaa dhayagala raajaa cherithi ninne bahughanatheja nee charanamule ne korithini nee varamulane ne vedi...