Parishudhudavai పరిశుద్ధుడవై – మహిమ 190
Parishudhudavai పరిశుద్ధుడవై – మహిమ 190.Parishuddhudavai పల్లవి : పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2) దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2) 1.నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2) శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన|| 2.నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి (2) నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి ||ఆరాధన|| 3.ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి (2) మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు ||ఆరాధన|| Pallavi : Parishuddhudavai – Mahima Prabhaavamulaku Neeve Paathrudavu Balavanthudavai – Deenula Pakshamai Krupa Choopu Vaadavu (2) Dayaaludavai – Dhaaraalamugaa Nanu Deev...