Dheenudaa ajeyudaa దీనుడా అజేయుడా 213 Lyrics
New year song 2021 Hosanna Dheenudaa ajeyudaa దీనుడా అజేయుడా Lyrics New year song 2021 Hosanna Ministries పల్లవి : దీనుడా అజేయుడా ఆధరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతిమించి పాడనా జీవదారవు నీవని కానుకనై పూజించనా అక్షయదీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే 1. సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా గమనములేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నా యెడల సందేహమేమి లేకుండ హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే స్తుతిమాలిక నీకే వజ్ర సంకల్పము నీవే 2. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసెద కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే విజయ శిఖరము నీవేగా 3. ఊహకందని ఉన్నతమైనది దివ్య నగరమే స్పటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా Pallav...