Aradhana sthuthi ఆరాధన స్తుతి ఆరాధన 188
Aradhana sthuthi ఆరాధన స్తుతి ఆరాధన 188. Aaraadhana sthuthi పల్లవి : ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన తండ్రియైన దేవా-కుమారుడైన ప్రభువా - పరిశుద్దాత్మ దేవా త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన 1.సర్వసృష్టికి ఆధారుడా-సకలజీవుల పోషకుడా సీయోనులోనుండి దీవించువాడవు సదాకాలము జీవించువాడవు సాగిలపడినే నమస్కరించి సర్వదా నిను కొనియాడేద-నిన్నే కీర్తించెద || తండ్రియైన || 2.సార్వత్రిక సంఘస్థాపకుడా-సర్వలోక రక్షకుడా సిలువలో నీ రక్తమే నాకై కార్చితివి శిథిలము కాని నగరమును కట్టితివి స్తోత్రము చెల్లింతు నీ కీర్తి తలచి సర్వలోకాన నీమహిమను నేను ప్రకటింతును || తండ్రియైన || 3.సర్వసత్యమునకు ఆధారమై-పరిశుద్ధయాజకుల సారధివై యాజక రాజ్యములో నను చేర్చుటకై నిత్యయాజకత్వమును ధరింపజేసితివి మహిమతో పరిచర్య నే చేయుటకై నూతన కృపలను నే పొందెద-ఆత్మతో శక్తితో సాగేద || తండ్రియైన || Pallavi : Aaraadhana sthuthi aaraadhana aathmatho sathyamutho neeke aaraadhana Thandriyaina dhevaa kumaarudaina prabhuvaa parishuddhaathma dheva thriyeka dhevaa aaraadhana sthuthi aaraadhana 1.Sarvasrutiki aadhaarudaa sakala jeevula poshaku...