Krupa sathya sampurnuda కృపా సత్య సంపూర్ణుడా

 Krupa sathya sampurnuda - కృపా సత్య సంపూర్ణుడా

73. Krupaa sathya sampoornudaa

పల్లవి : కృపా సత్య సంపూర్ణుడా
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా

1.ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే
|| కృపా ||

2.నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే
|| కృపా ||

3.నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా
నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా
నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ మారిపోయెనే
|| కృపా ||

Pallavi : Krupaa sathya sampoornudaa
sarvalokaanike chakkravarthivi neeve yesayyaa
naa sanmaanaanike mahaneeyudavu neevenayyaa

1.Yerra samudhramu nee aagnya meraku rahadhaarigaa maaragaa
dhaatire nee janulu bhahu kshemamugaa
aa jalamulalone shathru sainyamulu munigi poyene
!!Krupaa!!

2.Noothana kriyanu cheyuchunnaanani neevu selaviyyagaa
naa yedaari jeevithame suka saukkyamu kaagaa
naa aranya rodhana oollasamugaa maaripoyene
!!Krupaa!!

3.Naivedhyamulu dhahana balulu neevu koravugaa
naa praanaathma shariramu bali arpana kaagaa
naa jivha balulu sthothra baluluga maari poyene
!!Krupaa!!