Naa Hrudayamulo నా హృదయములో నీ మాటలే 182
Naa Hrudayamulo నా హృదయములో నీ మాటలే 182. Naa Hrudayamulo పల్లవి : నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతిరేఖలు కారు చీకటిలో కలువరి కిరణమై కఠినహృదయమును కరిగించినావు నీ కార్యములను వివరింపతరమా ? నీ ఘనకార్యములు వర్ణింపతరమా ? 1.మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలె కృపను కురిపించితివి విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు నీ కార్యములను వివరింపతరమా ? నీ ఘనకార్యములు వర్ణింపతరమా ? || నా హృదయములో || 2.విరజిమ్మె ఉదయకాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు ఆర్పజాలని జ్వాలగా చేసి ద్వీపస్థంభముపై నను నిలిపినావు నీ కార్యములను వివరింపతరమా ? నీ ఘనకార్యములు వర్ణింపతరమా ? || నా హృదయములో || 3.పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు నీ కార్యములను వివరింపతరమా ? నీ ఘనకార్యములు వర్ణింపతరమా ? || నా హృదయములో || Pallavi : Naa Hrudayamulo Nee Maatale Naa Kanulaku Kaanthi Rekhalu (2) Kaaru Cheekatilo Kaluvari Kira...