Sadguna shiludaa సద్గుణ శీలుడా 166

Sadguna shiludaa సద్గుణ శీలుడా 

166. Sadguna shiludaa

పల్లవి : సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు
స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు
సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి
నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి
యేసయ్యా నీ సంకల్పమే
ఇది నాపై నీకున్న అనురాగమే

1.సిలువ సునాదమును నా శ్రమదినమున
మధుర గీతికగా మదిలో వినిపించి
సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి
కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో
|| సద్గుణ ||

2.నాతోడు నీడవై మరపురాని
మహోప కార్యములు నాకై చేసి
చీకటి దాచిన -వేకువగా మార్చి
బలమైన జనముగా నిర్దారించితివి నీ కీర్తి కొరకే
|| సద్గుణ ||

3.నా మంచి కాపరివై మమతా సమతలు
మనోహర స్థలములలో నాకనుగ్రహించి
మారా దాచిన మధురము నాకిచ్చి
నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆద్యంతమై
|| సద్గుణ ||

Pallavi : Sadguna shiludaa neeve poojyudavu
sthuthi aaraadhanaku neeve yogyudavu
sathya pramaanamutho shaashwatha krupanicchi
nee priyuni swaasthyamu naakicchithivi
yesayyaa nee sankalpame edhi naapai neekunna anuraagame

1.Siluva sunaadhamunu naa shrama dhinamuna
madhura geethikaga madhilo vinipinchi
siluvalo dhaagina sarvasampadhalicchi
kaanthimayamuga kanaparachithive nee aathma shakthitho
!!Sadguna!!

2.Naa thodu needavai marapuraani
mahopa kaaryamulu naakai chesi
chikati dhaachina vekuvagaa maarchi
balamaina janamuga nirdharinchithivi nee keerthi korake
!!Sadguna!!

3.Naa manchi kaaparivai mamathaa samathalu
manohara sthalamulalo naakanugrahinchi
maaraa dhaachina madhuramu naakicchi
nadipinchuchunnaavu surakshithamuga nannu adhyanthamai
!!Sadguna!!