Posts

Showing posts with the label Ne Prema Naalo నీ ప్రేమ నాలో మధురమైనది

Nee Prema Naalo నీ ప్రేమ నాలో మధురమైనది 203

Nee Prema Naalo నీ ప్రేమ నాలో మధురమైనది 203. Nee Prema Naalo మనోహరుడా! నా యేసయ్య.......! పల్లవి : నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ||2|| ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపరతు నిన్నే సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు సత్యస్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే 1. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో – కాదనలేదే నా మనవులు నీవు ||2|| హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమకావ్యం నిరతము నాలో నీవే – చెరగని దివ్యరూపం ||2|| ఇది నీ బహు బంధాల అనుబంధమ తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే ||2|| ||నీ ప్రేమ|| 2. నా ప్రతి పదములో జీవము నీవే – నా ప్రతి అడుగులో విజయము నీవే ||2|| ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును ||2|| ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే ||2|| ||నీ ప్రేమ|| 3. నీ సింహాసనము నను చేర్చుటకు – సిలువను మోయుట నేర్పించితివి ||2|| కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి – సమభూమిపై నడిపినావు ||2|| ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజోవి...