Naa Korika Nee Pranaalika Hosanna Ministries 2023 - 230
Hosanna Ministries 2023 new Album Adviteeyudaa song : 230 నా కోరిక నీ ప్రణాళిక - Naa Korika Nee Pranaalika పల్లవి : నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్ధన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను ఆశలవాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతిపాడనా నా హృదయ విధ్వాంసుడా !! నా కోరిక !! 1. యధార్దవంతుల యెడల నీవు యెడబాయక కృపచూపి గాఢాందకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనై నే నడచినందునా దీర్ఘాయువుతో తృప్తిపరచినా సజీవుడవు నీవేనయ్యా !! నా హృదయములో !! 2. నాలో ఉన్నది విశ్వాసవరము తోడైఉన్నది వాగ్ధానబలము ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిసెగా ఆర్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా !! నా హృదయములో !! 3. స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నె తరగని ఉపదేశం మహిమగలిగిన సంఘముగా నను నిలుపునే నీ యెదుట సిగ్గుపరచదు నన్నె...