Neeve krupadharamu నీవే కృపాధారము త్రియేక దేవా 204

Neeve krupadharamu నీవే కృపాధారము త్రియేక దేవా

204. Neeve krupaadhaaramu

పల్లవి : నీవే కృపాధారముత్రియేక దేవా
నీవే క్షేమాధారము నా యేసయ్యా ||2||
నూతన బలమును నవ నూతన కృపను ||2||
నేటివరకు దయచేయుచున్నావు –
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా

1. ఆనందించితిని అనురాగ బంధాల
ఆశ్రయపురమైన నీలో నేను ||2||
ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి ||2||
ఆపదలెన్నో అలముకున్నను – అభయము నిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి
ఆలొచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా
ఈ స్తోత్ర గీతం అంకితమయ్యా ||2||
||నీవే||

2. సర్వకృపానిధి – సీయోను పురవాసి –
నీ స్వాస్థ్యముకై నను పిలచితివి ||2||
సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను –
సహనము కలిగి ||2||
శిధిలముకాని సంపదలెన్నో నాకై దాచితివి
సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా –
ఈ స్తోత్ర గీతము నీకేనయా
||నీవే||

3. ప్రాకారములను దాటించితివి –
ప్రార్ధన వినెడి పావనమూర్తివి ||2||
పరిశుద్ధులతో నను నిలిపితివి –
నీ కార్యములను నూతన పరచి ||2||
పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
పరామరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా –
ఈ స్తోత్ర గీతము నీకెనయా
||నీవే||

Pallavi : Neeve krupaadhaaramu triyeka deva
Neeve kshemaadhaaramu naa Yeasayya ||2||
Nootana balamu nava nootana krupanu ||2||
Netivaraku dayacheyuchunnavu –
Ninne aaraadhintunu parishuddhudaa
Ee stotra geetamu neekenayya

Cha : 1. Aanandinchitini anuraaga bandhaala
aasrayapuramaina neelo nenu ||2||
Akarshinchitivi aakaashamukante
vunnatamaina nee premanu choopi ||2||
Aapadalenno alamukunnanu – Abhayamu nichhitivi
Aavedanala agnijwaalalo andaga nilachitivi
Aalochanavai aasrayamichhi kaapaaduchunnaavu
Neeke ee stotra geetam ankitamayya ||2||
||Neeve||

Cha : 2. Sarvakrupaanidhi seyonu puravaasi –
nee swasthyamukai nanu pilachitivi ||2||
Siluvanu moyuchu nee chittamunu neraverchedanu –
Sahanamukaligi ||2||
Sidhilamukaani sampadalenno naakai daachitivi
Saahasamaina goppa kaaryamulu naakai chesitivi
Sarvasakthigala devudavai nadipinchuchunnavu
Ninne aaraadintunu Parishuddhudaa –
Ee Stotra geetamu neekenayya
||Neeve||

Cha : 3. Praakaaramulanu daatinchitivi –
Praardhanavinedi paavana moorthivi ||2||
Parishudhhulato nano nilipitivi –
nee kaaryamulanu nootana parachi ||2||
Paavanamaina jeevanayaatralo vijayamu nichhitivi
Parama raajyamulo niluputakoraku abhishekinchitivi
Paavanudaa naa adugulu jaaraka sthiraparachinaavu
Ninne aaraadintunu Parishuddhudaa –
Ee Stotra geetamu neekenayya
||Neeve||