Nee Prema Naalo నీ ప్రేమ నాలో మధురమైనది 203

Nee Prema Naalo నీ ప్రేమ నాలో మధురమైనది

203. Nee Prema Naalo

మనోహరుడా! నా యేసయ్య.......!

పల్లవి : నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని క్షేమ శిఖరము ||2||
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపరతు నిన్నే
సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు
సత్యస్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే

1. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో –
కాదనలేదే నా మనవులు నీవు ||2||
హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమకావ్యం
నిరతము నాలో నీవే – చెరగని దివ్యరూపం ||2||
ఇది నీ బహు బంధాల అనుబంధమ
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే ||2||
||నీ ప్రేమ||

2. నా ప్రతి పదములో జీవము నీవే –
నా ప్రతి అడుగులో విజయము నీవే ||2||
ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా
నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును ||2||
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే ||2||
||నీ ప్రేమ||

3. నీ సింహాసనము నను చేర్చుటకు –
సిలువను మోయుట నేర్పించితివి ||2||
కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి – సమభూమిపై నడిపినావు ||2||
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే ||2||
||నీ ప్రేమ||

Pallavi : Ne Prema Naalo Madhuramainadhi -
Adhi Na Uhakandhani Kshema Sikaramu
Yerikorukunavu PremaChupinanu -
ParavasinchiNallo Mahaimaparathu Niney
Sarvakrupanedhi Neevu- Sarvadhikarivi Neevu
Sathyaswarupivi Neevu - Aradhinthunu Niney

Cha : 1. Cherithi Niney Veerigina Manasuthi -
Kadhanaledhey Na Manuvullu Neevu ||2||
Hrudhayamu Nindina Ganam - Nanu Nadipey Premakavyam
Nerantharamu Nallo Neevey - Cheragani Dhivya Rupam ||2||
Edhi ne Bahubandhalla Anubandhama ?
Thejoviraja Sthuthimahimallu nekey
Na Yesu raja Aradhana Nekey ||2||
!!Ne Prema Naalo!!

Cha : 2. Na prathi Padhamullo Jeevamu neevey -
Na prathi Adugullo Vijayamu neevey ||2||
Yenaduveeduvani Prema - Ninu Cherey Kshanamu Radha
Needaga natho Nillichey - Ne Krupaye Naku challunu ||2||
Edhi Ne prema Kuripinchu Hemanthama?
ThejoviRaja Sthuthimahimallu Nekey
Na yesu raja Aradhana Nekey ||2||
!!Ne Prema Naalo!!

Cha : 3. Ne simhasanamu Nanu Cherchutaku -
Silluvanu Moyuta nerpinchithivi ||2||
Kondallu loyallu dhatey - Mahimathmatho Nimpinavu
Dhayagalla Athamatho Nimpi - Sama bumipai Nadipinavu ||2||
Edhi ne Athmabandhamukai Sankethama
Thejoviraja Sthuthimahimallu Nekey
Na YesuRaja Aradhana Nekey ||2||
!!Ne Prema Naalo!!