Naa hrudhayana నా హృదయాన కొలువైన 116
Naa hrudhayana నా హృదయాన కొలువైన
116. Naa hrudhayaana
పల్లవి : నా హృదయాన కొలువైన - యేసయ్యా
నా అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే
నీ సన్నిధిలో పూజార్హుడా
1.అగ్ని ఏడంతలై - మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను
అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడే నే
నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే
నా స్తోత్రబలులన్నీ నీకేనయ్యా
||నా హృదయాన||
2.అంతా వ్యర్థమని - వ్యర్థులైరెదరో
నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే
నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెను
నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును
||నా హృదయాన||
3.విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ - వృదిచేసింది నీవే కదా
సంఘక్షేమాభివృదికే - పరిచర్య ధర్మము నియమించినావే
నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే
నా స్వరము నీకే అర్పింతును
||నా హృదయాన||
Pallavi : Naa hrudhayaana koluvaina yesayyaa
naa anuvanuvu ninne prasthuthinchene keerthaneeyudaa
naa hrudhayaarpanalo pranamilledhane
nee sannidhilo poojaarhudaa
1.Agni yedanthalai manduchundinanu
agni jwaalalu thaakaledhule nee priyula dhehalanu
agni bhalamu challaarene shathru samuhamu allaadene
nenu nee swaasthyame neevu naa sonthame
naa sthothrabalulanni neekenayyaa
!!Naa hrudhayaana!!
2.Anthaa vyarthamani vyarthulairendharo
naa guri neepai nilpinandhuke naa parugu saarthakamaayene
neeyandhu padina prayaasamu shaashwatha krupagaa naa yandhu nilichenu
neepai vishwaasame annu balaparachene
naa swarametthi ninne keerthinthunu
!!Naa hrudhayaana!!
3.Vitthinadhi okaru neeru posindhi verokaru
yeruvu vesindhi yevvarainanu vruddhi chesindhi neeve kadhaa
sangha kshemaabhivruddhike paricharya dharmamu niyaminchinaave
nee oopadheshame nannu sthiraparachene
naa sarvamu neeke arpinthunu
!!Naa hrudhayaana!!