Aradhana sthuthi ఆరాధన స్తుతి ఆరాధన 188
Aradhana sthuthi ఆరాధన స్తుతి ఆరాధన
188. Aaraadhana sthuthi
పల్లవి : ఆరాధన స్తుతి ఆరాధన
ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన
తండ్రియైన దేవా-కుమారుడైన ప్రభువా - పరిశుద్దాత్మ దేవా
త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన
1.సర్వసృష్టికి ఆధారుడా-సకలజీవుల పోషకుడా
సీయోనులోనుండి దీవించువాడవు
సదాకాలము జీవించువాడవు
సాగిలపడినే నమస్కరించి
సర్వదా నిను కొనియాడేద-నిన్నే కీర్తించెద
|| తండ్రియైన ||
2.సార్వత్రిక సంఘస్థాపకుడా-సర్వలోక రక్షకుడా
సిలువలో నీ రక్తమే నాకై కార్చితివి
శిథిలము కాని నగరమును కట్టితివి
స్తోత్రము చెల్లింతు నీ కీర్తి తలచి
సర్వలోకాన నీమహిమను నేను ప్రకటింతును
|| తండ్రియైన ||
3.సర్వసత్యమునకు ఆధారమై-పరిశుద్ధయాజకుల సారధివై
యాజక రాజ్యములో నను చేర్చుటకై
నిత్యయాజకత్వమును ధరింపజేసితివి
మహిమతో పరిచర్య నే చేయుటకై
నూతన కృపలను నే పొందెద-ఆత్మతో శక్తితో సాగేద
|| తండ్రియైన ||
aathmatho sathyamutho neeke aaraadhana
Thandriyaina dhevaa kumaarudaina prabhuvaa parishuddhaathma dheva
thriyeka dhevaa aaraadhana sthuthi aaraadhana
1.Sarvasrutiki aadhaarudaa sakala jeevula poshakudaa
seeyonu lonundi dheevinchuvaadavu
sadhaakaalamu jeevinchuvaadavu
saagilapadine namaskarinchi
sarvadhaa ninu koniyaadedha ninne keerthinchedha
!!Thandriyaina!!
2.Saarvaathrika sanghaa sthaapakudaa sarvaloka rakshakudaa
siluvalo nee rakthame naakai kaarchithivi
shidhilamu kaani nagaramunu kattithivi
sthothramu chellinthu neekeerthi thalachi
sarvalokaana neemahimanu nenu prakatinthunu
!!Thandriyaina!!
3.Sarvasathyamunaku aadhaaramai parishuddhayaajakula saaraadhivai
yaajaka raajyamulo nanu cherchutakai
nithya yaajakathvamunu dharimpajesithivi
mahimatho paricharya ne cheyutakai
noothana krupalanu nepondhedha aathma shakthitho saagedha
!!Thandriyaina!!