Oohakandani Premalona | ఊహకందని ప్రేమలోన | No 248 | Hosanna Ministries 2025 New Album

      

Hosanna Ministries 2025 new Album

song : 248

ఊహకందని ప్రేమలోన Oohakandani Premalona

Lyrics in Telugu

పల్లవి ఊహకందని ప్రేమలోన భావమే నీవు..
హృదయమందు పరవసించుగానమే నీవు..
మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు..
మరపురాని కలల సౌధం గురుతులేనీవు..
ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు..
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు..
                                   || ఊహకందని ప్రేమ ||

1. తల్లడి తల్లే తల్లి కన్నా మించిప్రేమించి
తనువు తీరే వరకు నన్ను విడువలేనంది.. (2)
అదియే.. ఆ ఆ ఆ నే గాయపరచిన వేళలో
కన్నీరు కార్చిన ప్రేమగా
నులివెచ్చనైన ఒడికి చేర్చిఆదరించిన ప్రేమయే
నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయే.. (2)
                                   || ఊహకందని ప్రేమ ||

2. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా
నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా.. (2)
అదియే.. ఆ ఆ ఆ తన మహిమ విడిచిన త్యాగము
ఈ భువికి వచ్చిన భాగ్యము
నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే
నీ సర్వమిచ్చిన దాతవు
నను హత్తుకున్న స్వామివి.. (2)
                                   || ఊహకందని ప్రేమ ||

3. దేహమందు గాయమైతే కుదుట పడును కదా
గుండె గాయము గుర్తుపట్టిన నరుడు లేడుకదా.. (2)
నీవే నీవే యేసయ్య
నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు..
ననుభుజముపైన మోసినఅలసిపోని ప్రేమవు
నీవు లేనిదే నా బ్రతుకులో
విలువంటూ లేనే లేదయ్యా .. (2)
                                   || ఊహకందని ప్రేమ ||

 Lyrics in English

Pallavi Oohakandani Premalona Bhaavame Neevu
Hrudayamandu Paravasinchuganame Neevu
Manasu Nindina Ramyamaina Gamyame Neevu
Marapurani Kalala Saudham Guruthuleneevu
Edabaayalenannaanija Snehame Neevu
Nee Prema Kaugililo Aanandame Neevu
|| Oohakandani Prema ||

1. Talladi Talle Talli Kanna Minchi Preminchi
Tanuvu Teere Varaku Nannu Viduvalenandi.. (2)
Adiye.. Aa Aa Aa Nee Gaayaparachina Velalo
Kanniru Karchina Premaga
Nulivechchainaina Odiki
Cherchi Aadarinchina Premaye
Nee Gundelo Nanu Cherchina
Nee Amaramaina Premaye.. (2)
|| Oohakandani Prema ||

2. Ningi Nelanu Kalipina Balamaina Vaaradhiga
Nela Korigina Jeevitanni Levanettenuga.. (2)
Adiye.. Aa Aa Aa Tana
Mahima Vidichina Tyaagamu
Ee Bhuviki Vachina Bhaagyamu
Nanu Datipoka Vedakina
Nee Madhuramaina Premaye
Nee Sarvamichchina Daathavu
Nanu Hattukunna Swaamivi.. (2)
|| Oohakandani Prema ||

3. Dehamandu Gaayamaite Kuduta Padunu Kada
Gunde Gaayamu Gurtupattina Narudu Ledukada.. (2)
Neeve Neeve Yesayya
Naa Antharangamu Tarachi
Chusina Gaadhamaaina Premavu..
Nanubhujamupaina Mosina Alasi Poni Premavu
Neevu Lenide Naa Brathukulo
Viluvantu Lene Ledayya.. (2)
|| Oohakandani Prema ||


 

Most Popupal Songs

Sarvonathuda neeve naku - సర్వోన్నతుడా - నీవే నాకు 18

Sadguna shiludaa సద్గుణ శీలుడా 166