Naalo Aemi Choochi - నాలో ఏమి చూచి Hosanna Ministries Song 234
Hosanna Ministries 2024 new Album Nithyathejudaa
song : 234
నాలో ఏమి చూచి - Naalo Aemi Choochi
పల్లవి : నాలో ఏమి చూచి నీవు ఇంతప్రేమ చూపినావు (2)
మర్త్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి
నేటివరకు తోడుండినావు.....
యేసయ్య... యేసయ్య -నా యేసయ్య... (2)
1. నా తల్లి గర్భమునె - నను కోరితివి...
విశ్వాస గృహములో - నను చేర్చితివి... (2)
అమృత జలమైన నీ నోటిమాటలతో
నిఖిల జగతికి నను పంపినావు
ప్రకటింప నీ చరితం.. నా జన్మ నిజఫలితం... (2)
||నాలో ఏమి||
2. ఘనమైన వారే - నీ యెదుటనున్నాను
బలమైన వారే - ఎందరో ఉన్నను... (2)
కన్నీళ్ళ కడలిలో - శ్రమల సుడులలో
నాస్థితి చూసి -నను చేరదీసి
మార్చితివి నీ పత్రికగా... కడవరకు నీ సాక్షిగా ... (2)
||నాలో ఏమి||
3. ప్రేమానురాగము - నీ సంస్కృతియే
కరుణ కటాక్షము - నీ గుణ సంపదయే... (2)
నలిగిన రెల్లుని - విరువని వాడా...
చితికిన బ్రతుకుని - విడువని వాడా...
నేనంటే నీకెందుకో... ఈ తగని మమకారము... (2)
||నాలో ఏమి||
4. ధవళ వర్ణుడవు - రత్న వర్ణుడవు
వర్ణనకందని - సుందరుడవు నీవు...||2||
ఇరువది నలుగురు పెద్దల మధ్యలో
మహిమ ప్రభావముతో - సింహాసనముపై
ఆసీనుడా యేసయ్యా... నా స్తుతి నీకేనయ్యా..||2||
||నాలో ఏమి||
Naalo Aemi Choochi Song Lyrics in English
Pallavi : Naalo Aemi Choochi Intha Prema Choopinavu (2)
Marthyamaina Lokamandhu Nithyamaina Krupanu Choopi
Netivaraku Thodundinaavu...
Yesayya... Yesayya... Naa Yesayya... (2)
1. Naa Thalli Garbamune Nanu Korithivi
Vishwaasa Gruhamulo Nanu Cherchithivi (2)
Amrutha Jalamaina Nee Notimaatalatho
Nikhila Jagathiki Nanu Pampinaavu
Prakatinpa Nee Charitham Naa Janma Nijaphalitham (2)
||Naalo Aemi||
2. Ghanamaina Vaare Nee Yedhutanunnaanu
Bhalamaina Vaare Aendharo Oonnanu (2)
Kannilla Kadalilo Shramala Sudulalo
Naa Sthithi Choosi Nanu Cheradhisi
Maarchithivi Nee Pathrikagaa Kadavaraku Nee Sakshigaa (2)
||Naalo Aemi||
3. Premaanuraagamu Nee Samskruthiye
Karuna Kataakshamu Nee Guna Sampadhaye (2)
Naligina Relluni Viruvani Vaadaa
Chithikina Brathukuni Viduvani Vaadaa
Nenante Neekendhuko Ee Tharagani Mamakaaramu (2)
||Naalo Aemi||
4.Dhavala Varnudavu Rathna Varnudavu
Varnanakandhani Sundharudavu Neevu (2)
Eruvadhi Naluguru Peddhala Madhyalo
Mahima Prabhavamutho Simhasanamupai
Aaseenudaa Yesayyaa Naa Sthithi Neekenayyaa (2)
||Naalo Aemi||