Athi Parishuddhudaa stuthi naivedyamu - 224
AthiParishuddhudaa stuthinaivedyamu - అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము
Song:224
NEW YEAR SONG 2023
పల్లవి : అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము - నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా - నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే - ఆశ్రయమైన నా యేసయ్యా
1. సర్వోన్నతమైన స్థలములయందు - నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము - ఎన్నడు ఆశ్చర్యమే !!2!!
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం !!2!!
నీలోనే దాచావు ఈనాటికై - నీ ఋణం తీరదు ఏనాటికి !!2!! ||అతిపరిశుద్ధుడా||
2. సద్గుణరాశి నీ జాడలను - నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం - నీ కృపకు సంకేతమే !!2!!
కృపవెంబడి కృపపొందగా - మారాను మధురముగా నే పొందగా !!2!!
నాలోన ఏ మంచి చూసావయ్యా - నీప్రేమ చూపితివి నా యేసయ్యా !!2!! ||అతిపరిశుద్ధుడా||
3. సారెపైనున్న పాత్రగ నన్ను - చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక !!2!!
ఉన్నావులె ప్రతిక్షణమునా - కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున !!2!!
నీవెగా యేసయ్యా నా ఊపిరి - నీవెగా యేసయ్యా నా కాపరి !!2!! ||అతిపరిశుద్ధుడా||
Pallavi : AthiParishuddhudaa stuthinaivedyamu - Neeke arpinchi keerthinthunu
Neeve naa pakshamai nanu deevinchaga - Neeve naa thoduvai nanu nadipinchaga
Jeevinthunu neekosame... Aasrayamaina naa Yesayya
1. Sarvonnathamaina sthalamulayandhu - Nee mahima vivarimpaga
Unnathamaina nee sankalpamu - Yennadu ascharyame !!2!!
Mundhennadu chavichudani sarikrotthadhaina premaamrutham !!2!!
Neelone daachaavu eenaatikai - Nee runam theeradhu yenaatiki! !!2!! ||AthiParishuddhudaa||
2.Sadhgunaraashi neejaadalanu - Naa yedhuta nunchukoni
Gadachina kaalam saagina payanam - Nee krupaku sankethame !!2!!
Krupavembadi krupapondhaga - Maaraanu madhuramuga ne pondhagaa !!2!!
Naalona ye manchi choosaavayaa! - Nee prema choopithivi naa Yesayya !!2!! ||AthiParishuddhudaa||
3. Saarepainunna paathraga nannu - chejaariponivvaka
Shodhanalenno yedirinchinanu - nanu soliponivvaka !!2!!
Vunnavule prathikshanamuna.. kalisi unnavule prathi aduguna !!2!!
Neevega Yesayya naa voopiri - Neevega Yesayya naa kaapari !!2!! ||AthiParishuddhudaa||
Athi Parishuddhudaa stuthinaivadyamu - అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము NEW YEAR SONG 2023