Karuna sampannuda lyrics in Telugu & English - 218 Srikarudaa naa yesayya 2022 Lyrics
కరుణా సంపన్నుడా - Karuna sampannuda lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics
పల్లవి : కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద
నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వికుడా
నీ కోసమే నా జీవితం
1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను
అణువణువును బలపరచే నీ జీవపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను
ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను
2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని
నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా
3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది
నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం
తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద
కరుణా సంపన్నుడా - Karuna sampannuda lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics
Pallavi : Karuna sampannuda dheeruda sukumaaruda
nee prabhaava mahimalane nirantharam nenu prakatinchedha
naapaina prema choopinchi naa koraku thaagamaithive
naa yesayya saathweekudaa
nee kosame naa jeevitham
1. Ye naadu nanu veedani nee prema sandhesamu naa hrudhayaseemalone sandhadini chesenu
anuvanuvunu balaparache nee jeevapu vaakyame prathikshanam dhari cheri nanne thaakenu
aa vaakyame aarogyamai jeevimpajesi nanne nadipinchenu
2. Ee vintha lokamlo nee chentha cherithini enaleni premathone aadharana pondhithini
nee krupalo nilipinadhi nee prema bandhame anudhinamu makarandhame nee snehabandham
aa premalone kadavaraku nannu nadipinchumu sthiraparachuma
3. Ne vechiyunnaanu nee mahima prathyakshathakai naakunna ee neerikshane sannidhilo nilipinadhi
naa kosam nirminche soundharya nagaramulo pranamilli chesedhanu nee paadhaabivandhanam
thejomaya nee shobhitham ne pondhedha koniyaadedha