Sthuthi paadutake brathikinchina 217 lyrics in Telugu & Englsh- Hosanna New Year Song 2022 Lyrics
Sthuthi paadutake brathikinchina lyrics in Telugu & English- Hosanna New Year Song 2022 Lyrics
పల్లవి : స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నన్ను పోషించినా
తల్లివలె నన్ను ఓదార్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా !! 2 !!
జీవితకాలమంతా - ఆధారం నీవేనయ్యా
నా జీవిత కాలమంత - ఆరాధించి ఘనపరతును
1 . ప్రాణభయమును తొలగించినావు - ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప - దీర్ఘాయువుతో నను నింపినావు !! 2 !!
నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున - నూతన బలమిచ్చెను. || స్తుతి ॥
2 . నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు - కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు - లోకములోనుండి ఏర్పరచినావు !! 2 !!
నీ దివ్య సంకల్పమే - అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై - నిరీక్షణ కలిగించెను. ॥ స్తుతి ॥
3. హేతువులేకయే ప్రేమించినావు - వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు - నా చేయి విడువక నడిపించినావు !! 2 !!
నీ ప్రేమ మాధుర్యమే - నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతిస్థలమున - పారెను సెలయేరులై. ॥ స్తుతి ॥
Sthuthi paadutake brathikinchina lyrics in English- Hosanna New Year Song 2022 Lyrics
Pallavi : Sthuthipaadutake brathikinchina
Jeevana daathavu neevenayya
Innaalluga nanu poshinchina
Thallivale nanu odhaarchina
Nee prema naapai ennadu maaradhu yesayya !! 2 !!
Jeevithakaalamantha - aadhaaram neevenayya
Naa jeevithakaalamantha - aaraadhinchi ghanaparathunu
1.Praanabhayamulanu tholaginchinaavu - praakaaramulanu sthaapinchinaavu
Sarvajanulalo neemahima vivarimpa - deerghaayuvutho nanu nimpinaavu !! 2 !!
Nee krupa baahulyame veedani anubandhamai
Thalachina prathikshanamuna - noothana balamichhenu. !! Sthuthi !!
2.Naapai vudhayinche nee mahima kiranaalu - Kanumarugaayenu naa dhukhadhinamulu
Krupalanupondhi nee kaadi moyutaku - Lokamulonundi yerparachinaavu !! 2 !!
Nee dhivya sankalpame - Avanilo subhapradhamai
Nee nithya raajyamunakai - nereekshana kaliginchenu. !! Sthuthi !!
3.Hethuvulekaye preminchinaavu - Vedukaga ila nanu maarchinaavu
Kalavaramondhina velalayandhu - naa cheyi viduvaka nadipinchinaavu !! 2 !!
Nee prema maadhuryame - naa nota sthuthigaanami
Nilichina prathisthalamuna paarenu selayerulai. !! Sthuthi !!