Amarudavu neevu naa yesayya 214 అమరుడవు నీవు నా యేసయ్య Lyrics

 

 New year song 2021 Hosanna Amarudavu neevu naa yesayya అమరుడవు నీవు నా యేసయ్య Lyrics 

New year song 2021 Hosanna Ministries

పల్లవి : అమరుడవు నీవు నా యేసయ్య ఆదియు అంతము నీవేనయ్యా
ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో
సొమ్మసిల్లక సాగిపోదును సీయోను మార్గములో
స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో

1. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే
ప్రతి విజయము నీకంకితం నా బ్రతుకే నీ మహిమార్ధం
లోకమంతయు దూరమైనను నను చేరదీసెదవు
దేహమంతయు ధూళియైనను జీవింపజేసెదవు

2. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా
పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము
తీర్చగలనా నీ ఋణమును మరువగలనా నీ ప్రేమను
కన్న తండ్రిగ నన్ను కాచి కన్నీరు తుడిచితివి
కమ్మనైన ప్రేమచూపి కనువిందు చేసితివి

3. జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా
మరణము గెలచిన పరిశుద్దుడవు పునరుత్ధానుడవు నీవయ్యా
జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము
గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన
ఆత్మ దీపము వెలిగించినావు నీకే ఆరాధన

Pallavi : Amarudavu neevu naa yesayya aadhiyu anthamu neevenayyaa
aadhilonunna nee vaakyame aadharinchenu srama kolimilo
sommasillaka saagipodhunu seeyonu maargamulo
sthothra geethamu aalapinthunu nee divya sannidhilo

1. Shakthiki minchina samaramuloa nerpithivi naaku nee chitthame
sikshaku kaave shodhanalanni unnatha krupatho nanu nimputake
prathi vijayamu neekankitham naa brathuke nee mahimaardham
lokamanthayu dooramainanu nanu cheradheesedhavu
dhehamanthayu dhooliyainanu jeevimpa jesedhavu

2. Vekuva kurisina chirujallulo nee krupa naalo pravahinchagaa
pondhithinenno upakaaramulu navanoothaname prathi dinamu
theerchagalanaa nee runamunu maruvagalanaa nee premanu
kanna thandrigaa nannu kaachi kanneeru thudichithivi
kammanaina prema choopi kanuvindhu chesithivi

3. Jaldharu vrukshamunu polina gunaseeludavu neevenayya
maranamu gelichina parishuddhudavu punaruddhanudavu neevayya
jayaseeludavu neevenani aaraadhinthunu prathi nithyamu
gunde gudilo nindinaavu neeke aaraadhana
aathma deepamu veliginchinaavu neeke aaraadhana