Yesayya nee krupa యేసయ్యా నీ కృపా
Yesayya nee krupa - యేసయ్యా నీ కృపా
83. Yesayyaa nee krupaa
పల్లవి : యేసయ్యా నీ కృపా - నను అమరత్వానికి
అర్హునిగా మార్చెను - యేసయ్యా నీ కృపా
1.నీ హస్తపు నీడకు పరుగెత్తగా - నీ శాశ్వత కృపతో నింపితివా
నీ సన్నిధిలో దీనుడనై - కాచుకొనెద నీ కృప ఎన్నడు
|| యేసయ్యా ||
2.నీ నిత్య మహిమకు పిలిచితివా - నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా
ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన - ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును
|| యేసయ్యా ||
3.గువ్వవలె నే నెరిగి నిను చేరనా - నీ కౌగిటనే నొదిగి హర్షించనా
ఈ కోరిక నాలో తీరునా ? - రాకడలోనే తీరును
|| యేసయ్యా ||
Pallavi : Yesayyaa nee krupaa nanu amarathvaaniki
arhunigaa maarchenu yesayyaa nee krupaa
1.Nee hasthapu needaku parugetthagaa
nee shaashwatha krupatho nimpithivaa
nee sannidhilo dheenudanai
kaachukonedha nee krupa ennadu
!!Yesayyaa!!
2.Nee nithya mahimaku pilichithivaa
nee swaasthyamugaa nannu marchithivaa
aathmaabhishekamutho sthiraparachina
aaraadhyudaa ninne ghanaparathunu
!!Yesayyaa!!
3.Guvvavalene negiri ninu cheranaa
nee kaugita nenodhigi harshinchanaa
ee korika naalo theerunaa?
raakadalone theerunu
!!Yesayyaa!!