Yesayya kanikarapurnuda యేసయ్య కనికరపూర్ణుడా 181

Yesayya kanikarapurnuda యేసయ్య కనికరపూర్ణుడా

181. Yesayya kanikarapuurnudaa

పల్లవి : యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా
నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము

1.నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి
సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే
|| యేసయ్య ||

2.నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు
దాహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి
ఆలసినవారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము
|| యేసయ్య ||

3.నీ వలన బలమునొందిన వారే ధన్యులు
నీ సన్నిధియైన సీయెనులో వారు నిలిచెదరు
నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు
నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు
|| యేసయ్య ||

Pallavi : Yesayya kanikarapuurnudaa
manoehara preamaku nilayudaa
neeveanaa samtoeshagaanamuu
sarvasampadalaku aadhaaramu

1.Naa valana eadiyu aashimpakayea preamimchitivi
nanu rakshinchutaku unnata bhaagyamu vidichitivi
siluva maanupai raktamu kaarchi rakshinchitivi
shaashvata krupapomdi jeevintunu ila nee korakea
!!Yesayya!!

2.Naa koraku sarvamu dhaaraalamugaa dayacheayu vaadavu
dahamu teerchutaku bandanu cheelchina upakaarivi
aalasina vaari aashanu trupti parachitivi
ananta krupa pondi aaraadhintunu anukshanamu
!!Yesayya!!

3.Nee valana balamu nondina vaarea dhanyulu
nee sannidhiyaina seeyenuloe vaaru nilichedaru
niluvaramaina raajyamuloe ninu chuchutaku
nityamu krupa pondi seavinchedanu tudivaraku
!!Yesayya!!