Yepati Dhananaya ఏపాటి దాననయా
Yepati Dhananaya - ఏపాటిదాననయా
ఏపాటిదాననయా – నన్నింతగ హెచ్చించుటకు
పల్లవి : ఏపాటిదాననయా – నన్నింతగ హెచ్చించుటకు
నేనెంతటిదాననయా – నాపై కృప చూపుటకు !! 2 !!
నా దోషము భరియించి – నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు – కలువరిలో మరణించి
ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవా – నీ కృపకు సాటియేది
|| ఏపాటి దాననయా ||
1. కష్టాల కడలిలో – కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు – నన్నాదరించావు !! 2 !!
అందరు నను విడచిన – నను విడువని యేసయ్యా
విడువను ఎడబాయనని – నా తోడై నిలిచితివా
|| ప్రేమించే ప్రేమామయుడా ||
2. నీ ప్రేమను మరువలేనయ్య – నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను – ప్రకటింతును బ్రతుకంతా !! 2 !!
నేనొందిన ఈ జయము – నీవిచ్చినదేనయ్య
నీవిచ్చిన జీవముకై – స్తోత్రము యేసయ్య
|| ప్రేమించే ప్రేమామయుడా ||
Pallavi : Yepati dhananaya – nanninthaga hechinchutaku
nenenthati dhananayaa – naapai krupa chooputaku !! 2 !!
naa dhoshamu bariyinchi – naa paapamu kshamiyinchi
nanu neela maarchutaku – kaluvarilo maraninchi
Preminchey Premaamayuda – nee premaku parimithulevi
krupachoopu krupagala deva – nee krupaku saati yedi
|| Yepati dhananaya ||
1.Kastaala kadalilo – kanniti loyalalo
naa thodu nilichaavu – nannaadarinchaavu !! 2 !!
andaru nanu vidachina – nanu viduvani Yesayyaa
viduvanu edabaayanani – naa thodai nilichitivaa
|| Preminchey Premaamayuda||
2.Nee premanu maruvalenayya – nee saakshiga brathikedanesayyaa
nenondina nee krupanu – prakatinthunu brathukantha !! 2 !!
nenondina ee jayamu – neevichinadenayya
neevichchina jeevamukai – sthothramu Yesayya
|| Preminchey Premaamayuda||