Vishvasamu lekunda విశ్వాసము లేకుండా 124

 Vishvasamu lekunda విశ్వాసము లేకుండా

124. Vishvaasamu lekundaa

పల్లవి : విశ్వాసము లేకుండా దేవునికి
ఇష్టులైయుండుట అసాధ్యము
విశ్వాసము ద్వారా మన పితరులెందరో
రాజ్యాల్ని జయించినారు

1.హనోకు తన మరణము చూడకుండ
పరమునకు ఎత్తబడిపోయెనుగా
ఎత్తబడకమునుపే దేవునికి
ఇష్టుడైయుండినట్లు సాక్షమొందెను
|| విశ్వాసము ||

2.నోవహు దైవభయము గలవాడై
దేవునిచే హెచ్చింపబడిన వాడై
ఇంటివారి రక్షణకై ఓడను కట్టి
నీతికే వారసుడని సాక్షమొందెను
|| విశ్వాసము ||

3.మోషే దేవుని బహుమానము కొరకై
ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి
శ్రమలనుభవించుటయే భాగ్యమని
స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను
|| విశ్వాసము ||

4.వీరందరు సాక్ష్యము పొందియున్నను
మనము లేకుండా సంపూర్ణులు కారు
అతి పరిశుద్ధమైన విశ్వాసముతో
మరి శ్రేష్ఠమైన సీయోనుకే సిద్ధపడెదము
|| విశ్వాసము ||

Pallavi : Vishvaasamu lekundaa dhevuniki
isttulai yunduta asaadhyamu
vishvaasamu dhwaaraa mana pitharulendharo
raajyaalni jayinchinaaru

1.Hanoku thana maranamu choodakunda
paramunaku yetthabadi poyenugaa
yetthabadaka munupe dhevuniki
isttudai yundinattlu saakshyamondhenu
!!Vishvaasamu!!

2.Novahu dhaivabhayamu galavaadai
dhevuniche heccharinchabadina vaadai
intivaari rakshanakai odanu katti
neethike vaarasudani saakshyamondhenu
!!Vishvaasamu!!

3.Moshe dhevuni bhahumaanamu korakai
aigupthu sukabhogaalanu dhweshinchi
shramalanubhavinchutaye bhaagyamani
sthirabhuddhi galavaadai saakshyamondhenu
!!Vishvaasamu!!

4.Veerandharu saakshyamu pondhiyunnanu
manamu lekundaa sampoornulu kaaru
athi parishuddhamaina vishvaasamutho
mari shrestamaina seeyonukai siddhapadedhamu
!!Vishvaasamu!!