Vinarandi Naa Priyuni వినరండి నా ప్రియుని 206
Vinarandi Naa Priyuni వినరండి నా ప్రియుని
206. Vinarandi Na Priyuni
పల్లవి : వినరండి నా ప్రియుని విశేషము
వినరండి నా ప్రియుని విశేషము –
నా ప్రియుడు సుందరుడు మహా ఘనుడు ||2||
వినరండి నా ప్రియుని విశేషము –
నా వరుడు సుందరుడు మహా ఘనుడు
నా ప్రియుని నీడలో చేరితిని –
ప్రేమకు రూపము చూసితిని ||2||
ఆహా ఎంతో! మనసంతా ఇక ఆనందమే
తనువంతా పులకించే మహాధానందమే!
1. మహిమతో నిండిన వీధులలో –
బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో ||2||
జతగ చేరేదను ఆ సన్నిధిలో –
కురిసే చిరుజల్లై ప్రేమామృతము
నా ప్రియయేసు నను చూసి దరిచేరునే
జతగ చేరేదను ఆ సన్నిధిలో –
నా ప్రేమను ప్రియునికి తెలిపేదను
కన్నీరు తుడిచేది నా ప్రభువే
||వినరండి||
2. జగతికి రూపము లేనపుడు –
కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు ||2||
స్తుతినే వస్త్రముగా ధరించుకొని –
కృపనే జయధ్వనితో కీర్తించెదను
నా ప్రభుయేసు చెంతన చేరేదను
స్తుతినే వస్త్రముగా ధరించుకొని –
నా ప్రభుయేసు చెంతన చేరేదను
యుగమొక క్షణముగ జీవింతును
||వినరండి||
3. తలపుల ప్రతి మలుపు గెలుపులతో –
నిలిచే శుద్ద హృదయాల వీరులతో ||2||
ఫలము ప్రతి ఫలము నే పొందుకొని –
ప్రియయేసు రాజ్యములో నే నిలిచెదను
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
ఫలము ప్రతి ఫలము నే పొందుకొని –
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
నా ప్రియుని విడువను నేనెన్నడు
||వినరండి||
Pallavi : Vinarandi Na Priyuni Visheshamu -
Na Priyudu Sundharudu Mahaganudu ||2||
Vinarandi Na Priyuni Visheshamu -
Na Varudu Sundharudu Mahaganudu
Na Priyuni Needallo Cherithini -
Premaku Rupamu Chusithini ||2||
Aha ! Yentho Manasantha Eka Anandhamey
Thanuvantha Pullakinchey Mahadhanandhamey
Cha : 1. Mahimatho Nindina Vedhullalo -
Burallu Mrogey Akashapandhirillo ||2||
Jathaga Cheredhanu Ah sanidhillo
Kurisey Chiryjallau Prema Mruthamu
Na Priyudesu Nanu chusi Dharicheruney
Jathaga Chereydhanu Ah Sanidhillo
Na Premanu Priyuniki Thellipedhanu
Kaneru Thudachedhi Na Prabuvey
!!Vinarandi!!
Cha : 2. Jagathiki Rupamu Lenapudu
Korenu Thana Koraku na Prabuvu ||2||
Sthuthiney Vasthramuga Dharinchukoni
Krupaney jayadhwanitho Keerthinchedhanu
Na prabhu Yesu chenthana cheredhanu
Sthuthiney Vasthramuga Dharinchukoni
Na prabhu yesu chenthana Chereydhanu
Yugamoka Kshanamuga Jeevinthunu
!!Vinarandi!!
Cha : 3. Thallupulla Prathi Mallupu Gellupullatho
Nillichey shuda Hrudhayulla Veerullatho ||2||
Phallamu Prathi Phallamu Ney Pondhukone
Priya Yesu Rajyamullo NeyNillichedhanu
Ah Subhavella Nakentho Anandhamey
Phallamu prathiphallamu Ney pondhukoni
Ah Subhavella Nakentho Anandhamey
Na priyuni Veeduvanu Nenenadu
!!Vinarandi!!