Velpulalo bahuganuda వేల్పులలో బహుఘనుడా 175

Velpulalo bahuganuda వేల్పులలో బహుఘనుడా

175. Vaelpulaloa bahughanudaa

పల్లవి : వేల్పులలో బహుఘనుడా యేసయ్యా
నిను సేవించువారిని ఘనపరతువు (2)
నిను ప్రేమించువారికి సమస్తము
సమకూర్చి జరిగింతువు. . . .
నీయందు భయభక్తి గల వారికీ
శాశ్వత క్రుపనిచ్చేదవు. . . .

1.సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో
పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు (2)
మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో
ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో (2)
|| వేల్పులలో ||

2.ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములో
ఉన్నత కృపతో నింపావు ఉహించని స్దితిలో నిలిపావు (2)
విలువపెట్టి నను కొన్నావు నీ అమూల్య రక్తముతో
నిత్య జీవమునిచ్చుటకొరకు మహిమ రాజ్యములో (2)
|| వేల్పులలో ||

3.పామరుడైన సీమోనును కొలతలేని అత్మాభిషేకముతో
ఆజ్ఞనము తొలగించావు విజ్ఞాన సంపదనిచ్చావు (2)
పేరుపెట్టి నను పిలిచావు నిను పోలినడుచుటకు
చెప్పశక్యముకాని ప్రహర్షముతో నిను స్తుతించేదను (2)
|| వేల్పులలో ||

Pallavi : Vaelpulaloa bahughanudaa yaesayyaa
ninu saevinchuvaarini ghanaparathuvu (2)
ninu praemimchuvaariki samasthamu
samakoorchi jariginthuvu
neeyandhu bhayabhakthi gala vaarikee
shaashvatha krupanichchaedhavu

1.Sundharudaina yoasaepunu andhakaara bandhuvargaalaloa
pavithruniga nilipaavu phalinchaedi kommaga chaesaavu (2)
merugupetti nanu dhaachaavu nee ambula podhiloa
ghanavijayamunichchuta koraku thagina samayamuloa (2)
||vaelpulaloa||

2.Ooththamudaina dhaaveedhunu irukulaeni vishaala sthalamuloa
unnatha krupathoa nimpaavu uhinchani sthithiloa nilipaavu (2)
viluvapetti nanu konnaavu nee amoolya rakthamuthoa
nithya jeevamunichchutakoraku mahima raajyamuloa (2)
||vaelpulaloa||

3.Paamarudaina seemoanunu kolathalaeni athmaabhihhaekamuthoa
aajnyanamu tholaginchaavu vijnyaana sampadhanichchaavu (2)
paerupetti nanu pilichaavu ninu poalinaduchutaku
cheppashakyamukaani praharshmuthoa ninu sthuthiMchaedhanu (2)
||vaelpulaloa||