Sumadhura Swaramula సుమధుర స్వరముల 197
Sumadhura Swaramula సుమధుర స్వరముల
197. Sumadhura Swaramula
పల్లవి : సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే నిను స్తుతియించిన ప్రతీక్షణం (2)
1.ఎడారి త్రోవలో నేనడచిన - ఎరుగని మార్గములో నను నడిపిన
నా ముందు నడిచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
నీవే నీవే - నా ఆనందము
నీవే నీవే - నా ఆధారము (2)
|| సుమధుర ||
2.సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే - నా జయగీతము
నీవే నీవే - నా స్తుతిగీతము (2)
|| సుమధుర ||
3.వేలాది నదులన్ని నీమహిమను - తరంగపు పొంగులు నీబలమును
పర్వత శ్రేణులు నీకీర్తినే - ప్రకటించుచున్నావేగా (2)
నీవే నీవే - నా అతిశయము
నీకే నీకే - నా ఆరాధన (2)
|| సుమధుర ||
Pallavi : Sumadhura Swaramula Gaanaalatho –
Velaadi Doothala Galamulatho
Koniyaadabaduchunna Naa Yesayyaa –
Neeke Naa Aaraadhana (2)
Mahadaanandame Naalo Paravashame
Ninnu Sthuthinchina Prathikshanam (2)
Cha : 1. Aedaari Throvalo Ne Nadachinaa –
Aerugani Maargamulo Nanu Nadipinaa
Naa Mundu Nadachina Jayaveerudaa –
Naa Vijaya Sankethamaa (2)
Neeve Neeve Naa Aanandamu
Neeve Neeve Naa Aadhaaramu (2)
||Sumadhura||
Cha : 2. Sampoornamaina Nee Chiththame –
Anukoolamaina Sankalpame
Jariginchuchunnaavu Nanu Viduvaka –
Naa Dhairyamu Neevegaa (2)
Neeve Neeve Naa Jayageethamu
Neeve Neeve Naa Sthuthi Geethamu (2)
||Sumadhura||
Cha : 3. Velaadi Nadulanni Nee Mahimanu –
Tharangapu Pongulu Nee Balumunu
Parvatha Shrenulu Nee Keerthine –
Prakatinchuchunnavegaa (2)
Neeve Neeve Naa Athishayamu
Neeve Neeve Naa Aaraadhana (2)
||Sumadhura||