Sugunala Sampanudaa సుగుణాల సంపన్నుడా

Sugunala Sampanudaa సుగుణాల సంపన్నుడా

100. Sugunaala Sampannudaa

పల్లవి : సుగుణాల సంపన్నుడా
స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము

1.యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే
|| సుగుణాల ||

2.యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు
నేను నడువ వలసిన త్రోవలో
|| సుగుణాల ||

3.యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమయెదుట
ఇవి ఎన్న తగినవి కావే
|| సుగుణాల ||

Pallavi : Sugunaala Sampannudaa
sthuthi gaanaala vaarasudaa
jeevinthunu nithyamu nee needalo
aaswaadhinthunu nee maatala makarandhamu

1.Yesayya neetho jeevinchagaane
naa bhrathuku bhrathukugaa maarenule
naatyamaadenu naa antharangamu
edhi rakshanaanandha bhaagyame
!!Sugunaala!!

2.Yesayya ninnu vennantagaane
aagynala maargamu kanipinchene
neevu nannu nadipinchagalavu
nenu nadavavalasina throvalo
!!Sugunaala!!

3.Yesayya nee krupa thalanchagaane
naa shramalu shramalugaa anipinchaledhe
neevu naakichhe mahima yedhuta
evvi yenna thaginavi kaave
!!Sugunaala!!