Stuthi Ganame స్తుతి గానమే పాడనా 151
Stuthi Ganame స్తుతి గానమే పాడనా
151. Sthuthi Gaaname
పల్లవి : స్తుతి గానమే పాడనా
జయగీతమే పాడనా (2)
నా ఆధారమైయున్న
యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును (2)
1.నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)
నీ ధర్మాసనము – నా హృదయములో
స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2)
|| స్తుతి ||
2.శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)
నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
కృపావరములతో నను – అలంకరించితివే (2)
|| స్తుతి ||
3.నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2)
నీ సింహాసనము – నను చేర్చుటకై
నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2)
|| స్తుతి ||
Pallavi : Sthuthi Gaaname Paadanaa
Jayageethame Paadanaa (2)
Naa Aadhaaramaiyunna
Yesayyaa Neeku – Kruthagnudanai
Jeevithamanthayu Saakshinai Yundhunu (2)
1.Nammadhaginavi Nee Nyaaya Vidhulu
Melimi Bangaaru Kante – Entho Korathaginavi (2)
Nee Dharmaasanamu – Naa Hrudayamulo
Sthaapinchabadiyunnadhi – Parishuddhaathmuniche (2)
||Sthuthi||
2.Shreshtamainavi Neevichchu Varamulu
Loukika Gnaanamu Kante – Entho Upayukthamainavi (2)
Nee Shreshtamaina – Paricharyalakai
Krupaavaramulatho Nanu – Alankarinchithive (2)
||Sthuthi||
3.Noothanamainadhi Nee Jeeva Maargamu
Vishaala Maargamu Kante – Entho Aashinchadhaginadhi (2)
Nee Simhaasanamu – Nanu Cherchutakai
Naatho Neevuntive – Naa Guri Neevaithive (2)
||Sthuthi||