Srushtikarthavaina సృష్టికర్తవైన యెహోవా 174
Srushtikarthavaina సృష్టికర్తవైన యెహోవా
174. Srushtikarthavaina
పల్లవి : సృష్టికర్తవైన యెహోవా....
నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు....మహిమలో స్ధానమిచ్చినావు....
నాలో. . . . నిన్ను చూసావు....నీలో. . . . నన్ను దాచావు....
నిస్వార్ధమైన నీ ప్రేమమరణము కంటే బలమైనది నీప్రేమ
1.ఏ కాంతిలేని నిశిధిలోఏ తోడు లేని విషాదపు విధులలో
ఎన్నో అపాయపు అంచులలోనన్నాదుకున్న నా కన్నాతండ్రివి !!2!!
యేసయ్యా నను అనాధగ విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి !!2!!
|| సృష్టికర్తవైన ||
2.నిస్సారమైన నా జీవితములోనిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చినన్నాకర్షించిన ప్రేమ మూర్తివి !!2!!
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి !!2!!
|| సృష్టికర్తవైన ||
Pallavi : Srushtikarthavaina yehoavaa....
nee chaethi paniyaina naapai endhukintha praema
mantiki roopamichchinaavu....
mahimaloa sthaanamichchinaavu....
naaloa. . . . ninnu choosaavu....
neeloa. . . . nannu dhaachaavu....
nisvaardhamaina nee praema
maranamu kantae balamainadhi nee praema
1.Yae kaanthilaeni nishidhiloa
ae thoadu laeni vishaadhapu vidhulaloa
ennoa apaayapu anchulaloa
nannaadhukunna naa kannaathandrivi (2)
yaesayyaa nanu anaaahaga viduvak
neelaanjanamulathoa naaku punaadhulu vaesithivi (2)
!!Srushtikarthavaina!!
2.Nissaaramaina naa jeevithamuloa
nittoorpulae nanu dhinamella vaedhinchagaa
nashinchipoathunna nannu vedhaki vachchi
nannaakarshinchina praema moorthivi (2)
yaesayyaa nanu krupathoa balaparachi
ullaasa vasthramulanu naaku Dharimpajaesithivi (2)
!!Srushtikarthavaina!!