Srimanthuda yesayya శ్రీమంతుడా యేసయ్యా 67

 Srimanthuda yesayya - శ్రీమంతుడా యేసయ్యా

67. Srimanthudaa

పల్లవి : శ్రీమంతుడా యేసయ్యా
నా ఆత్మకు అభిషేకమా
నా అభినయ సంగీతమా

1.సిలువధారి నా బలిపీఠమా
నీ రక్తపు కోట నాకు నివాసమా
నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా
ఇదియే నీ త్యాగ సంకేతమా
|| శ్రీమంతుడా ||

2.మహిమగల పరిచర్య పొందినందున
అధైర్యపడను కృప పొందినందున
మహిమతో నీవు దిగి వచ్చువేళ
మార్పునొందెద నీ పోలికగా
|| శ్రీమంతుడా ||

3.సీయోను శిఖరము సింహాసనము
వరపుత్రులకే వారసత్వము
వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా
వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా
|| శ్రీమంతుడా ||

Pallavi : Srimanthudaa yesayyaa
naa aathmaku abhishekamaa
naa abhinaya sangeethamaa

1.Siluvadhaari naa bhali peetamaa
nee rakthapu kota naaku nivaasamaa
nannu neevu pilachina pilupu rahasyamaa
edhiye nee thyaaga sankethamaa
!!Srimanthudaa!!

2.Mahimagala paricharya pondhinandhuna
adhairyapadanu krupa pondhinandhuna
mahimatho neevu dhigi vacchuvela
maarpu nondhedha nee polikagaa
!!Srimanthudaa!!

3.Seeyonu shikaramu simhasanamu
varaputhrulake vaarasathvamu
vaagdhanamulanni neraverchuchuntivaa
vaagdhaana poornudaa naa yesayyaa
!!Srimanthudaa!!