Seyonulo Sthiramaina సీయోనులో స్థిరమైన 117
Seyonulo Sthiramaina సీయోనులో స్థిరమైన
117. Seeyonulo Sthiramaina
పల్లవి : సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను
1.సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా
|| సీయోనులో ||
2.కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా
|| సీయోనులో ||
3.కలతలు లేని కన్నీరు లేని
ఆకలి దప్పులు అసలే లేని
నీ శాశ్వత రాజ్యముకై
సమకుర్చుచున్నావా నా యేసయ్యా
|| సీయోనులో ||
4.సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే
|| సీయోనులో ||
Pallavi : Seeyonulo Sthiramaina Punaadi Neevu
Nee Meede Naa Jeevithamu Amarchukunnaanu
1.Sooryudu Leni Chandrudu Leni
Cheekati Raathrulu Lene Leni
Aa Divya Nagarilo Kaanthulanu
Virajimmedavaa Naa Yesayyaa
||Seeyonulo||
2.Kadali Leni Kadagandlu Leni
Kallola Sthithi Gathulu Darike Raani
Suvarna Veedhulalo
Nadipinchedavaa Naa Yesayyaa
||Seeyonulo||
3.Kalathalu Leni - Kanniru Leni
Akali Dappulu - Asale Leni
Nee Shaashwatha Rajyamukai
Samakurchuchunnavaa - Naa Yesayyaa
||Seeyonulo||
4.Sangha Prathiroopamu – Parama Yerushalemu
Soundarya Seeyonulo
Nee Manoharamaina Mukhamu Darshinthunu
Neethone Naa Nivaasamu Nithyamu Aanandame
||Seeyonulo||