Seeyonulo Nundi Neevu సీయోనులో నుండి నీవు 196

Seeyonulo Nundi Neevu సీయోనులో నుండి నీవు

196. Seeyonulo Nundi Neevu

పల్లవి : సీయోనులో నుండి నీవు -
ప్రకాశించుచున్నావు నాపై ||2||
సమాధానమై - సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీకీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా ||2||

1. నిర్దోషమైన మార్గములో -
నా అంతరంగమున ధైర్యమునిచ్చి ||2||
నీ సన్నిధిలో ననునిలిపి -
ఉన్నత విజయమునిచ్చితివి ||2||
నీ ఆశలు నెరవేరుటకు - నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు
||సీయోనులో||

2. నాయందు దృష్టినిలిపి -
నీస్నేహబంధముతో ఆకర్షించి||2||
కృపావరములతో ననునింపి -
సత్యసాక్షిగా మార్చితివి||2||
నీ మనస్సును పొందుకొని - నీ ప్రేమను నింపుకొని
కీర్తిoచెదను ప్రతినిత్యం
నిను ఆరాధింతును అనుక్షణము
||సీయోనులో||

3. నీ దివ్యమైన మహిమను -
పరలోకమందునే చూచెదను||2||
నీ కౌగిలిలొ చేర్చుకొని -
ప్రతిభాష్పబిందువును తుడిచెదవు||2||
నీ మాటల మకరందమును - మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను
||సీయోనులో||

Pallavi : Seeyonulo Nundi Neevu – Prakaashinchuchunnaavu Naapai (2)
Samaadhaanamai – Sadaakaalamu Nanu Neetho
Nadipinchuchunnaavu Nee Keerthikai
Seeyonulo Mahonnathudaa Yesayyaa (2)

1.Nirdoshamaina Maargamulo – Naa Antharangamuna Dhairyamunichchi (2)
Nee Sannidhilo Nanu Nilipi – Unnatha Vijayamunichchithivi (2)
Nee Aashalu Neraverutaku – Nee Chitthamu Jariginchutaku
Viduvavu Nanu Yedabaayavu
Neevu Viduvavu Nanu Yedabaayavu
||Seeyonulo||

2.Naayandu Drushti Nilipi – Nee Snehabandhamutho Aakarshinchi (2)
Krupaa Varamulatho Nanu Nimpi – Sathya Saakshigaa Maarchithivi (2)
Nee Manassunu Pondukoni – Nee Premanu Nimpukoni
Keerthinchedanu Prathi Nithyam
Ninu Aaraadhinthunu Anukshanamu
||Seeyonulo||

3.Nee Divyamaina Mahimanu – Paralokamandune Choochedanu (2)
Nee Kougililo Cherchukoni – Prathi Bhaashpa Binduvunu Thudichedavu (2)
Nee Maatala Makarandamunu – Marapuraani Anubandhamunu
Maruvanu Ennadu Viduvanu
Nenu Maruvanu Ennadu Viduvanu
||Seeyonulo||