Seeyonu raraju సీయోను రారాజు 139

Seeyonu raraju  సీయోను రారాజు తన

139. Seeyonu raaraaju

పల్లవి : సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై
రానై యుండగా త్వరగా రానై యుండగా
సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము
సంఘసహవాసములో ప్రేమసామ్రాజ్యములో

1.వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను
ఏర్పరచబడినవారే తొట్రిల్లుచున్న కాలమిదే
వీరవిజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికే
విధేయులమై నిలిచియుందుము
|| సీయోను ||

2.అధైర్యపడకు వదంతులెన్నో విన్నాను
ఆత్మభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే
నిత్యమహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో
నిరంతరము ఆనందించెదము
|| సీయోను ||

3.ఆశ్చర్యపడకు ఆకాశశక్తులు కదలినను
దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యె కాలమిదే
ఆర్భాటముగా రారాజు యేసు దిగివచ్చే వేళ
రూపంతరము మనము పొందెదము
|| సీయోను ||

Pallavi : Seeyonu raaraaju thana swaasthyamu korakai
raanai yundagaa thwaragaa raanai yundagaa
sampoorna siddhinondha sthirapadedhamu
sangha sahavaasamulo prema saamraajyamulo

1.Vivechinchumaa brama parachu prathi aathmanu
yerparachabadinavaare throtilluchunna kaalamidhe
veera vijayamutho nadipinchuchunna parishuddhaathmuniki
vidheyulamai nilichiyundhumu
!!Seeyonu!!

2.Adhairya padaku vadhanthulenno vinnaanu
aathmaabhishekamu kaligi krupalo niliche kaalamidhe
nithya mahimaku alankarinchu parishuddhaathmunilo
nirantharamu aanandhichedhamu
!!Seeyonu!!

3.Aascharya padaku aakaasha shakthulu kadhalinanu
dhaiva kumaarulandharu prathyakshamayye kaalamidhe
aarbhaatamugaa raaraaju yesu dhigivacche vela
roopaantharamu manamu pondhedhamu
!!Seeyonu!!