Sarvaloka nivasulara సర్వలోక నివాసులారా 159

Sarvaloka nivasulara  సర్వలోక నివాసులారా

159. Sarvaloka nivaasulaaraa

పల్లవి : సర్వలోక నివాసులారా - సర్వాధికారిని కీర్తించెదము రారండి
యెహోవా ఏతెంచెను- తన పరిశుద్ధ ఆలయములో
మన సంతోషము - పరిపూర్ణము చేయు
శాంతి సదనములో నివసింతుము

1.కరుణా కటాక్షము పాప విమోచన
యేసయ్యలోనే ఉన్నవి
విలువైన రక్షణ అలంకారముతో
దేదీప్యమానమై ప్రకాశించెదము
|| సర్వలోక ||

2.ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు
మన దేవుని సన్నిధిలో ఉన్నవి
పరిశుద్ధమైన అలంకారముతో
కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము
|| సర్వలోక ||

3.సమృద్ధి జీవము సమైక్య సునాదము
జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి
మృదువైన అక్షయ అలంకారముతో
సద్భక్తితో సాగిపోదము
|| సర్వలోక ||

Pallavi : Sarvaloka nivaasulaaraa - sarvaadhikaarivi keerthinchedhamu raarandi
yehovaa yethenchenu - thana parishuddha aalayamulo
mana santhoshamu - paripoornamu cheyu
shaanthi sadhanamulo nivasinthumu

1.Karunaa kataakshamu paapavimochana
yesayyalone oonnavi
viluvaina rakshana alankaaramutho
dhedhivyamaanamai prakaashinchedhamu
!!Sarvaloka!!

2.Ghanathaa prabhaavamu vignyana sampadhalu
mana dhevuni sannidhilo oonnavi
parishuddhamaina alankaaramutho
kruthagnyatha sthuthulatho praveshinchedhamu
!!Sarvaloka!!

3.Samruddhi jeevamu samaikya sunaadhamu
jyestula sanghamulo oonnavi
mrudhuvaina akshaya alankaaramutho
sadbhakthitho saagi podhamu
!!Sarvaloka!!