Sarirarevaru సరిరారెవ్వరూ

 Sarirarevaru సరిరారెవ్వరూ

106. Sariraarevvaru

పల్లవి : సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి

1.నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే
నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే
|| సరిరారెవ్వరూ ||

2.ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే
ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే
|| సరిరారెవ్వరూ ||

3.పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే
శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే
నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే
|| సరిరారెవ్వరూ ||

Pallavi : Sariraarevvaru naa priyudaina yesayyaku
sarvamu nerigina sarveshwaruniki
sarihaddhulu leni parishuddhuniki

1.Nammadhagina vaade naludhishala nemmadhi kalugajeyuvaade
naajeeru vrathamu jeevithamanthaa anusarinchinaade
naakai niluvella siluvalo naligi kariginaade
!!Sariraarevvaru!!

2.Aarogya pradhaathaye sampoorna swasthatha anugrahinchuvaade
aascharya kriyalu jeevithamanthaa cheyuchu thiriginaade
naakai koradaala dhebbalanu anubhavinchinaade
!!Sariraarevvaru!!

3.Punarudthaanude jayasheeli mruthini jayinchi lechinaade
shrestamaina punarudthaana bhalamu yeecchinaade
naakai athi thwaralo mahimatho raanai yunnavaade
!!Sariraarevvaru!!