Rajadhi raja రాజాధిరాజ రవి కోటి తేజ 161

Rajadhi raja రాజాధిరాజ రవి కోటి తేజ

161. Raajaadhi raaja

పల్లవి : రాజాధిరాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలకా
విడువని కృప నాలో స్థాపించేనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును

1.వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి
కృపాసత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద
|| రాజాధి రాజా ||

2.ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో
|| రాజాధి రాజా ||

3.మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే
|| రాజాధి రాజా ||

Pallavi : Raajaadhi raaja raavikoti theja
ramaneeya saamrajya paripaalakaa
viduvani krupa naalo sthaapinchene
seeyonulo nunna sthuthula simhasanamunu

1.Varnanakandhani paripoornamaina - nee
mahimaswaroopamunu naakorake thyaagamu chesi
krupaasathyamulatho kaapaaduchunnaavu
dhinamella nee keerthi mahimalanu nenu prakatinchedha
!!Raajaadhi!!

2.Oohalakandhani oonnathamaina - nee
ooddheshyamulanu naa yedala saphala parachi
ooreginchuchunnaavu vijayosthavamutho
yesayya nikanna thodevvaru leru ee dharanilo
!!Raajaadhi!!

3.Makutamu dharinchina maharaajuvai - nee
saubhaagyamunu naakorake siddhaparachithivi
nee parishuddhamaina maargamulo nadichi
nee saakshinai kaankshatho paadedha sthothra sankeerthanale
!!Raajaadhi!!