Prabhuva nee kaluvari ప్రభువా నీ కలువరి త్యాగము 156

 Prabhuva nee kaluvari ప్రభువా నీ కలువరి త్యాగము

156. Prabhuvaa nee

పల్లవి : ప్రభువా నీ కలువరి త్యాగము
చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే

1.నీ రక్షణయే ప్రాకారములని
ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి
లోకములోనుండి ననువేరు చేసినది
నీదయా సంకల్పమే
|| ప్రభువా ||

2.జీవపు వెలుగుగ నను మార్చుటకే
పరిశుద్ధాత్మను నాకొసగితివే
శాశ్వత రాజ్యముకై నను నియమించినది
నీ అనాది సంకల్పమే
|| ప్రభువా ||

3.సంపూర్ణునిగా నను మార్చుటకే
శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే
పరిపూర్ణ శాంతితో నను కాచుటయే
నీ నిత్యసంకల్పమే
|| ప్రభువా ||

Pallavi : Prabhuvaa nee kaluvari thyaagamu - choopenae nee paripoornathanu
naaloa sath kriyalu praarambhinchina alpaa oamaegaa neevaithivae

1.Nee rakshanayae praakaaramulani
prakhyaathiyae naaku gummamulani thelipi
loakamuloanundi nanuvaeru chaesinadhi - needhayaa sankalpamae
!!Prabhuvaa!!

2.Jeevapu veluguga nanu maarchutakae
parishudhdhaathmanu naakosagithivae
shaashvatha raajyamukai nanu niyaminchinadhi - nee anaadhi sankalpamae
!!Prabhuvaa!!

3.Sampoornunigaa nanu maarchutakae
shramalaloa nee krupa ninduga nichchithivae
paripoorna shaanthithoa nanu kaachutayae - nee nithya sankalpamae
!!Prabhuvaa!!