Nuthana yerushalem నూతన యెరుషలేమ్ 51

 Nuthana yerushalem - నూతన యెరుషలేమ్

51. Nuthana yerushalem

పల్లవి : నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
స్వర్గమునందున్న- దేవుని యొద్దనుండి

1.శోభ కలిగిన - ఆ దివ్య నగరము
వర్ణింప శక్యము - కానిదియే
బహు సహస్రముల - సూర్యుని కంటె
ప్రజ్వలించుచున్నది - మహిమవలెను
||నూతన||

2.పరిపూర్ణమైన -సౌందర్యమును
పృథ్వికి - ఆనందముగాను
భూరాజులందరు - మహిమ తెచ్చెడి
మహిమగల నగరము – ఇదియే
||నూతన||

3.ధగధగ మెరయు - సూర్యకాంతం వలె
జ్వలించుచున్న- దైవనగరమందు
నీతిమంతులే - సూర్యునివలెను
నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు
||నూతన||

Pallavi : Nuthana yerushalem dhigivacchuchunnadhi
pendli kumaarthe vale mahimatho nindi
swargamunandhunna dhevuni yoddhanundi

1.Shobha kaligina aa dhivya nagaramu
varnimpa shakyamu kaanidhiye
bhahu sahaasramula sooryuni kante
prajwalinchuchunnadhi mahima valenu
!!Nuthana!!

2.Paripoornamaina soundaryamunu
prudviki aanandhamugaanu
bhooraajulandharu mahima thecchedi
mahimagala nagaramu edhiye
!!Nuthana!!

3.Dhagadhaga merayu sooryakaantham vale
jwalinchuchunna dhaivanagaramandhu
neethimanthule sooryunivalenu
nithya nithyamugaa prakaashinchuchundhuru
!!Nuthana!!