Neeti vagula koraku - నీటి వాగుల కొరకు 13

 

Neeti vagula koraku - నీటి వాగుల కొరకు

 13.Neeti vagula koraku

Pallavi : Neeti vagula koraku dhuppi aashinchunatlu
nee koraku naa pranamu dhappigonuchunnadhi

Naa pranamaa naa samasthamaa prabhuni sthuthiyinchumaa
naa yesu chesina mellanu neevu maruvakumaa

1.Panikirani nannu neevu paiki lepithivi
kristhane bandapaina nannu nilipithivi
naa adugulu sthiraparachi bhalamu nicchithivi
needhu adugu jaadalane vembadinthu prabhu
ne vembadinthu prabhu
!!Naa pranamaa!!

2.Andhakarapu loyalalo nenu nadachithini
ye apayamu rakunda nannu kachithivi
kanna thandrivi neevani ninnu kolichedhanu
elalo ninnu kolichedhanu
!!Naa pranamaa!!

3.Needhu athmatho nindugaa nannu nimpu prabhu
aathma phalamulu dhandigaa neekai phaliyinthunu
neevu chesina mellanu nenetlu marathu prabhu
nee koraku ne saakshiga elalo jeevinthunu
ne elalo jeevinthunu
!!Naa pranamaa!!

పల్లవి : నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది
నా ప్రాణమా నా సమస్తమా - ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా

1.పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి
నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు
॥నా ప్రాణమా॥

2.అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి
కంటి పాపగ నీవు నన్ను కాచితివి
కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను
ఇలలో నిన్ను కొలచెదను
॥నా ప్రాణమా॥

3.నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మా ఫలములు దండిగా నీకై ఫలియింతును
నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు
నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును
॥నా ప్రాణమా॥