Nee mukamu manoharamu నీ ముఖము మనోహరము
Nee mukamu manoharamu నీ ముఖము మనోహరము
102. Nee mukamu manoharamu
పల్లవి : నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
1.నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై –
నను ఎన్నడు వీడని అనుబంధమై
|| యేసయ్య ||
2.నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై –
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు
|| యేసయ్య ||
3.నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై –
నను మైమరచి నేనేమి చేసేదనో
|| యేసయ్య ||
Pallavi : Nee mukamu manoharamu nee swaramu maadhuryamu
nee paadhaalu aparanji mayamu
Yesayyaa naa praana priyudaa
managalanaa ninnu veedi kshanamaina
1.Neeve naathoduvai neeve naa jeevamai
naa hrudhilona nilichina gynaapikavai
anuvanuvuna nee krupa nikshipthamai
nanu yennadu veedani anubhandhamai
!!Yesayyaa!!
2.Neeve naa shailamai neeve naa shrungamai
naa vijayaanike neevu bhujabalamai
anu kshanamuna shathruvuku prathyakshamai
nanu venudheyaniyaka vennu thattinaavu
!!Yesayyaa!!
3.Neeve veluguvai neeve aalayamai
naa nithyathwamunaku aadhyanthamai
amara lokaana shuddhulatho parichayamai
nanu maimarachi nenemi chesedhano
!!Yesayyaa!!