Nee Krupa Naku నీ కృపా నాకు చాలును

 Nee Krupa Naku నీ కృపా నాకు చాలును

75. Nee Krupa Naaku

పల్లవి : నీ కృపా నాకు చాలును
నీ కృప లేనిదే నే బ్రతుకలేను

1.జలరాసులన్ని ఏకరాశిగా - నిలిచిపొయెనే నీ జనుల ఎదుట
అవి భూకంపాలే యైనా - పెను తుఫానులే యైనా
నీ కృపయే శాసించునా - అవి అణగి పోవునా
||నీ కృపా||

2.నా జన్మభూమి వికటించగా - మారిపోయెనే మరుభూమిగా
నీ కౌగిలి నను దాచెనే - నీ త్యాగమే నను దోచెనే
నీ కృపయే నిత్యత్వమా - నీ స్వాస్థ్యమే అమరత్వమా
||నీ కృపా||

3.జగదుత్పత్తికి ముందుగానే - ఏర్పరచుకొని నన్ను పిలచితివా
నీ పిలుపే స్థిరపరచెనే - నీ కృపయే బలపరచెనే
నీ కృపయే ఈ పరిచర్యను - నాకు అనుగ్రహించెను
||నీ కృపా||

Pallavi : Nee Krupa Naaku Chaalunu
Nee Krupa Lenide Ne Brathukalenu (2)

1.Jala Raasulanni Eka Raasiga
Nilichipoyene Nee Janula Eduta (2)
Avi Bhoo Kampaale Ainaa
Penu Thuphaanule Ainaa (2)
Nee Krupaye Shaashinchunaa
Avi Anagipovunaa (2)
||Nee Krupa||

2.Naa Janma Bhumi Vikatinchagaa
Maaripoyene MaruBhoomigaa (2)
Nee Kaugili Nanu Dhaachene
Nee Thyagame Nanu Dhochene (2)
Nee Krupaye Nithyathvamaa
Nee Swaasthyame Amarathvamaa (2)
||Nee Krupa||

3.Jagadudpaththiki Mundugaane
Erparachukoni Nannu Pilachithivaa (2)
Nee Pilupe Sthiraparachene
Nee Krupaye Balaparachene (2)
Nee Krupaye Ee Paricharyanu
Naaku Anugrahinchenu (2)
||Nee Krupa||