Naa yesayya naa stuthi నా యేసయ్యా నా స్తుతి
Naa yesayya naa stuthi నా యేసయ్యా నా స్తుతి
104. Naa yesayyaa naa
పల్లవి : నా యేసయ్యా నా స్తుతియాగము
నైవేద్యమునై ధూపము వోలె
నీ సన్నిధానము చేరును నిత్యము
చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2)
1.ఆత్మతోను మనసుతోను
నేను చేయు విన్నపములు (2)
ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై
విజ్ఞాపన చేయుచున్నావా (2)
విజ్ఞాపన చేయుచున్నావా
|| నా యేసయ్యా ||
2.ప్రార్థన చేసి యాచించగానే
నీ బాహు బలము చూపించినావు (2)
మరణపు ముల్లును విరిచితివా నాకై
మరణ భయము తొలగించితివా (2)
మరణ భయము తొలగించితివా
|| నా యేసయ్యా ||
3.మెలకువ కలిగి ప్రార్థన చేసిన
శోధనలన్నియు తప్పించెదవు (2)
నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై
రారాజుగా దిగి వచ్చెదవు (2)
రారాజుగా దిగి వచ్చెదవు
|| నా యేసయ్యా ||
Pallavi : Naa yesayyaa naa sthuthi yaagamu
naivedhyamulai dhoopamuvole
nee sannidhaanamu cherunu nithyamu
chethuvu naaku sahayamu venu ventane - venuventane
1.Aathmathonu manasuthonu
nenu cheyu vinnapamulu
aalakinchi thandri sannidhilo naakai
vignyaapana cheyuchunnaavaa
!!Naa yesayyaa!!
2.Praarthana chesi yaachinchagaane
nee bhaahubalamu choopinchinaavu
maranapu mullunu virachithivaa naakai
marana bhayamu tholaginchithivaa
!!Naa yesayyaa!!
3.Melukuva kaligi praarthana chesina
shodhanalanniyu thappinchedhavu
nee prathyakshathane choochutake naakai
raaraajugaa dhigi vacchedhavu
!!Naa yesayyaa!!