Naa Sthuthula Paina నా స్తుతుల పైన 155
Naa Sthuthula Paina నా స్తుతుల పైన
155. Naa Sthuthula Paina
పల్లవి : నా స్తుతుల పైన నివసించువాడా
నా అంతరంగికుడా యేసయ్యా (2)
నీవు నా పక్షమై యున్నావు గనుకే
జయమే జయమే ఎల్లవేళలా జయమే (2)
1.నన్ను నిర్మించిన రీతి తలచగా
ఎంతో ఆశ్చర్యమే
అది నా ఊహకే వింతైనది (2)
ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి
ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2)
|| నా స్తుతుల ||
2.ద్రాక్షావల్లి అయిన నీలోనే
బహుగా వేరు పారగా
నీతో మధురమైన ఫలములీయనా (2)
ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే
విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2)
|| నా స్తుతుల ||
3.నీతో యాత్ర చేయు మార్గములు
ఎంతో రమ్యమైనవి
అవి నాకెంతో ప్రియమైనవి (2)
నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి
పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2)
|| నా స్తుతుల ||
Pallavi : Naa Sthuthula Paina Nivasinchuvaadaa
Naa Antharangikudaa Yesayyaa (2)
Neevu Naa Pakshamai Yunnaavu Ganuke
Jayame Jayame Ellavelalaa Jayame (2)
1.Nannu Nirminchina Reethi Thalachagaa
Entho Aascharyame
Adi Naa Oohake Vinthainadi (2)
Erupekkina Shathruvula Choopu Nundi Thappinchi
Enaleni Premanu Naapai Kuripinchaavu (2)
||Naa Sthuthula||
2.Draakshaavalli Aina Neelone
Bahugaa Veru Paaragaa
Neetho Madhuramaina Phalamuleeyanaa (2)
Unnatha Sthalamulapai Naaku Sthaanamichchithive
Vijayudaa Nee Krupa Chaalunu Naa Jeevithaana (2)
||Naa Sthuthula||
3.Neetho Yaathra Cheyu Maargamulu
Entho Ramyamainavi
Avi Naakentho Priyamainavi (2)
Nee Mahimanu Koniyaadu Parishuddhulatho Nilichi
Padi Thanthula Sithaaratho Ninne Keerthincheda (2)
||Naa Sthuthula||