Naa margamunaku నా మార్గము నకు
Naa maargamunaku - నా మార్గము నకు
90. Naa maargamunaku
పల్లవి : నా మార్గము నకు దీపమైన
నా యేసుతో సదా సాగెద
1.గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను
ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి
ఆత్మనాధునితో సాగెదను
|| నా మార్గ ||
2.నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను
నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను
నిరీక్షణతో నే సాగెదను
|| నా మార్గ ||
3.సమస్తమైన నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా
నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చిన
నా దేవునితో సాగెదను
|| నా మార్గ ||
4.ప్రతి ఫలము నేను పొందుటకు నిరీక్షణతో నున్న ధైర్యమును
పలు శ్రమలందును విడవకుండ ప్రాణాత్మ దేహము సమర్పించి
ప్రియుని ముఖము చూచి సాగెదను
|| నా మార్గ ||
Pallavi : Naa maargamunaku dheepamaina
naa yesunitho sadhaa saagedha
1.Gaadaandhakaarapu loyalalo marana bhayamu nannu kamminanu
aathmayandhu nenu krungipovaka anudhinam aanandhimpacheyunatti
aathmanaadhunitho saagedhanu
!!Naa maargamunaku!!
2.Naa yokka prayathnamulanniyunu nishphalamuga avi maarinanu
naa yokka aashalu anniyunu niraashaluga maaripoyinanu
nireekshanatho ne saagedhanu
!!Naa maargamunaku!!
3.Samasthamaina bhaaramulu sampoornamuga prabhu theerchunugaa
naa sannidhi neeku thodugaa vacchunani selavicchina
naa dhevunitho saagedhanu
!!Naa maargamunaku!!
4.Prathi phalamu nenu pondhutaku nireekshanatho nannu dhairyamunu
palushramalandhunu viduvakunda praanaathma dhehaamu samarpinchi
priyuni mukkam choochi saagedhanu
!!Naa maargamunaku!!